అచ్చేదిన్ అంటే.. సచ్చేదిన్ తెచ్చింది
– కేంద్రం పాలనతోనే ధరల పెరుగుదల
– గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న గులాబీ నేతలు
– ప్రధాని మోడి దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో అచ్చేదిన్ తెస్తామన్న కేంద్ర ప్రభుత్వం పేదలు సచ్చేదినాలను తీసుకవచ్చిందని తాండూరు టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేంద్రం గ్యాస్ ధరలను ఎంచడంతో మంత్రి కేటీఆర్ పిలపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో నిర్వహించిన దర్నాలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్లు నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం పెంచిన ధరలపై హోరెత్తిన నినాదాలతో భగ్గుమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు ముందు రూ.400లు ఉన్న ధర ప్రస్తుతం రూ. 1105లు అయ్యిందని విమర్శించారు. దీంతో పాటు పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యవసర ధరలను పెంచి పేదలపై భారం మోపుతోందన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమన్నారు. అందరికి అచ్చేదిన్ తేస్తామన్న కేంద్రం మోడిపాలనలో సచ్చే దీన్ వచ్చాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన ధరలను తగ్గించకుంటే గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం నాయకులు ప్రధాని నరేంద్రమోడి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయదేవి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు సుమిత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



