ఎంసీహెచ్ డాక్టర్‌కు ఉత్తమ అవార్డు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంసీహెచ్ డాక్టర్‌కు ఉత్తమ అవార్డు
– అందుకున్న ఆర్ఎంఓ డా. అనిల్ కుమార్
– స్పీకర్, కలెక్టర్ చేతులు మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) వైద్యుడికి ఉత్తమ అవార్డు దక్కింది. ఆసుపత్రి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డా.అనిల్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లాలో ఉత్తమ పనీతీరును కనబరిచిన అదికారులకు ఉత్తమ అవార్డులు అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తాండూరు ఎంసీహెచ్ ఆర్ఎంఓ డా.అనిల్ కుమార్ ఉత్తమ వైద్యుడి అవార్డు అందుకున్నారు.

వేడుకలలో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమక్షంలో డా.ఆనంద్ కుమార్ అవార్డును అందుకున్నారు. డా.అనిల్ కుమార్ ఉత్తమ అవార్డును అందుకోవడం పట్ల ఉన్నతాధికారులు, ఆసుపత్రి వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

స్వాతంత్ర దినోత్సవంలో షాక్