స్వాతంత్ర దినోత్సవంలో షాక్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్వాతంత్ర దినోత్సవంలో షాక్
– విద్యుత్ఘాతంతో ఎలక్ర్టీషన్ మృతి
– తాండూరు మున్సిపల్‌ పరిధిలో విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో షాకింగ్ సంఘటన జరిగింది. విద్యుత్ఘాతంతో ఓ ఎలక్ట్రీషీయన్ మృతి చెందాడు. ఈ సంఘటన దిగ్ర్బాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే… 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో విద్యుత్ స్థంబాలకు విద్యుత్ దీపాల అలంకరణ పనులు రెండు రోజుల నుంచి చేపడుతున్నారు. గురువారం ఉదయం కూడా ఈ పనులు కొనసాగాయి. హైదరాబాద్‌కు చెందిన వహీద్‌ అనే వ్యక్తి కాంట్రాక్టు పొంది పనులు చేయిస్తున్నారు.

హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో సెంట్రల్ లైటింగ్ స్థంబానికి విద్యుత్ అలంకరణ చేస్తుండగా ఫారుఖ్ అనే యువకుడికి విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు. ఈ సంఘటన అందరిని దిగ్ర్బాంతికి గురిచేసింది. అంతకుముందు ఆసుపత్రిలో ఉండగా మున్సిపల్ చైర్ పర్సన్‌ స్వప్న పరిమళ్ పరామర్శించారు. మరోవైపు ఈ సంఘటనలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కాంట్రాక్టర్ పనులు చేయిస్తున్న అధికారులు పర్యవేక్షించకపోవడం పట్ల విమర్శలు వెలువెత్తాయి. కాంట్రాక్టర్ ద్వారా వచ్చే కమీషన్‌పై పెట్టిన చిత్తశుద్ది ప్రాణాలపై పెట్టలేదని పలువురు వాపోతున్నారు.

ఇదికూడా చదవండి…

బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి