భోళా శంక‌రుడుగా ద‌ర్శ‌నమిచ్చిన శివుడు

తాండూరు వికారాబాద్

భోళా శంక‌రుడుగా ద‌ర్శ‌నమిచ్చిన శివుడు
– భ‌ద్రేశ్వ‌రాల‌యంలో వైభ‌వంగా కార్తీక పౌర్ణ‌మి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌సిద్ద భావిగి భ‌ద్రేశ్వ‌ర దేవాల‌యంలో కార్తీక పౌర్ణ‌మి వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. గురువారం కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఆల‌యంలో వెల‌సిన శివుడు భోళా శంక‌రుడుగా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆల‌య పూజారి విజ‌య్ కుమార్ స్వామి శివున్ని భోళా శంక‌రుడుగా అలంక‌రించారు.
విష‌యం తెలుసుకున్న భ‌క్తులు ఆల‌యానికి చేరుకుని శివున్ని ద‌ర్శించుకున్నారు. మ‌హిళ భ‌క్తులు కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా శివుని ముందు, నందీశ్వ‌రుని ముందు కార్తీక దీపాల‌ను వెల‌గించి మొక్కులు తీర్చుకున్నారు. భ‌క్తుల రాక‌.. కార్తీక దీపోత్స‌వాల‌తో భ‌ద్రేశ్వారాల‌యంలో కార్తీక పౌర్ణ‌మి శోభ సంత‌రించుకుంది.