వెల్లుల్లిలో మేలైన గుణాలు..!
– గుండపోటు ప్రమాదం తగ్గింపు
– గ్యాస్, ఎసీడీటీ నుంచి రక్షణ
– ఖాళీ కడుపుతో తింటే మరిన్ని ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటశాలలలో ముఖ్యమైన మసాలా వెల్లుల్లి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు వేలల్లో ఉన్నాయి. ఖనిజాలు, ప్రొటీన్లు, ఐరన్, కొవ్వుతో కూడిన ఈ మసాలాను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, వెల్లుల్లిని మితంగా తీసుకోవడం మంచిది. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతోపాటు గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే వెల్లుల్లిలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఆకుపచ్చ వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెల్లుల్లి యాంటీ హైపర్లిపిడెమియా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. అంతేకాకుండా మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోజూ 2-3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాల్లో ఒకటి కడుపులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీని వల్ల మలమూత్రాలు సాఫీగా విడుదలవుతాయి. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సహజంగా శరీరాన్ని టాక్సిన్స్ నుండి కాపాడతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మీరు కాళ్ళ వాపు సమస్యతో బాధపడుతుంటే, ఈ పొడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లి తొక్కను నీటిలో వేసి మరిగించి, దానితో మీ పాదాలను కడుక్కోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మీరు కాళ్ళ వాపు సమస్యతో బాధపడుతుంటే, ఈ పొడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లి తొక్కను నీటిలో వేసి మరిగించి, దానితో మీ పాదాలను కడుక్కోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
ఇదికూడా చదవండి…

