ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
– చిట్టిగణాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సంబరాలను జరుపుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషాధారణ, విద్యార్థినిలు గొల్లభామల వేషాధారణలో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాల ప్రాంగణం ఆబాలగోపాలాన్ని తలపించింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంజురాణి, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డిలు మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని అందరు అర్థం చేసుకుని లోకకళ్యాణం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుఉల ప్రమోద్ కుమార్, శశివర్ణ, వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తిననీయడం లేదని..!