శ్రీ కృష్ణం.. వందే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ కృష్ణం.. వందే..!
– అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
– వాడ వాడలా గోకులాష్టమి సంబరాలు
– ఇంటింటా సందడి చేసిన చిన్నికృష్ణులు, గోపికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం ఇంటింటా చిన్ని కృష్ణులు.. చిలిపి కృష్ణులు.. గోపికలు సందడి చేశారు. కృష్ణాష్ఠమి సందర్భంగా తెలుగు ఇండ్లలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని పూజలతో ఇండ్లు దైవాలయాలుగా మారాయి. అనంతరం ఇంటిలోని చిన్నారులను నల్లన్నయ్యలుగా.. యశోధ.. గోపిక లుగా అలంకరించారు. శ్రీకృష్ణులు, గోపికల ఆట పాటలతో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలు వైభవంగా జరిగాయి.

ద్వారాకా నగర్‌లో…
పట్టణంలోని ద్వారాకానగర్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో శ్రీ కృష్ణుని, గొల్ల బాల భామల ప్రతిమలను ఉంచి పూజలు నిర్వ వాంచారు. శ్రీ కృష్ణుని నామకరణం, డోలారోహణం, పెరుగు బసంతం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు ఆర్వీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సతీమణి. ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, సునితా సంపత్, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డిలతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదవ సంఘం ఆధ్వర్యంలో…
అదేవిధంగా తాండూరు యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ రామ మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకున్నారు. శ్రీ కృష్ణుని చిత్రపటానికి సంఘం సభ్యులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజు యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి బస్వరాజ్ యాదవ్. మల్లేశం యాదవ్, లాలప్ప యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు తాండూరు పట్టణంలోని పాండు రంగా దేవాలయం, గీతా మందిరం దేవాలయాలతో పాటు వాడా వాడలా గోకులాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో రాజకీయ, పట్టణ ప్రముఖులు, భక్తులు ఉత్సహాంగా పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అదృష్టమంటే అక్కదే..!