ర‌క్త‌దానం చేద్దాం రండి..!

తాండూరు వికారాబాద్

ర‌క్త‌దానం చేద్దాం రండి..!
– పోలీసు శాఖ పిలుపు
– 26న తాండూరులో ర‌క్త‌దాన శిబిరం

తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆప‌ద‌లో ఉన్న వారి ప్రాణాల‌ను నిలిపేందుకు ర‌క్త‌దానం చేద్దాం రండి అంటూ తాండూరు డివిజ‌న్ పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేసిన‌ట్లు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మంగ‌ళ‌వారం తాండూరు డీఎస్పీ కార్యాల‌యంలో ఉద‌యం 9 గంటల నుంచి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్ల‌డించారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు నిర్వ‌హిస్తున్న ర‌క్త‌దాన శిబిరంలో ర‌క్త‌దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పోలీసు అమర వీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.