కట్ట మైసమ్మా ఆశీస్సులు మెండుగా ఉండాలి
– అన్నదానంకు దాత సాయం అభినందనీయం
– మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆకాంక్షించారు. సోమవారం అమావాస్య సందర్భంగా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ కుటుంబ సమేతంగా హాజరై ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా నిరంతరం ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గత 22 నెలలుగా దేవాలయంలో అన్నదానం చేస్తున్న అలంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులను, కుమ్మరి నర్సింలులను అభినందించారు. అదేవిధంగా దేవాలయంలో అన్నదానంకు దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయని వారి సాయాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్ కూతురు వర్త్యా ప్రశాంతి, వర్త్యా రవి కుమార్, ఆలయ కమిటి అధ్యక్షులు బి.నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉప కార్యదర్శి కె.నర్సింలు, కోశాధికారి అంజిలయ్య, టీ.రాములు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ సుధాకర్, ఎస్. సుధాకర్, పట్నం రమేష్, రాజేష్, కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, బెజ్జు రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి, దీలీప్ సింగ్ ఠాకూర్, ఆలయ అర్చకులు చందుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

