హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు
– సమితి ప్రహారి నిర్మాణానికి రూ. 25 లక్షలు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఎమ్మెల్సీని సన్మానించిన హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్. సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులోని హిందూ ఉత్సవ సమితికి గతంలో రెండు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అట్టి స్థలంలో ప్రహారి నిర్మాణానికి రూ. 25లక్షలు అందజేస్తామని హామి ఇచ్చారు. ఇందుకు సమితి సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, బిడ్కర్ రఘు, కోశాధికారి తర్లపల్లి భాను, కౌన్సిలర్ బోయరవి, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

