రేపు తాండూరులో శాంతి సమావేశం
– హాజరు కానున్న జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని రేపు బుధవారం తాండూరులో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో దుర్గ్యా గ్రాండ్యూర్లో మధ్యాహ్నం 2గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరవుతున్నారు.
ఈ సమావేశానికి తాండూరు మున్సిపల్తో పాటు పోలీసు సబ్ డివిజన్లోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, హిందూ వాహినీ, ఆర్ఎస్ఎస్, వినాయక ఉత్సవ సమితి సభ్యులు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, ముస్లిం పెద్దలు హాజరుకావాలని సీఐ సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

