– ఎమ్మెల్యేను సన్మానించిన విశ్వనాథ్ గౌడ్
తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఆదివారం తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పట్టణంలోని విశ్వనాథ్ గౌడ్ నివాసానికి వెళ్లారు. విశ్వనాథ్ గౌడ్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు.
అనంతరం విశ్వనాథ్ గౌడ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని శాలువా వేసి సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వెంట వచ్చిన మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌ను కూడ సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సింలు, అఫ్పూ(నయూం), శ్రీనివాస్ చారీ, హరిహరగౌడ్ తదితరులు ఉన్నారు.