ఏమీరా.. బాలరాజు.. ఇదీ..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఏమీరా.. బాలరాజు.. ఇదీ..!
– మద్యం మత్తులో 108కు ఫేక్ కాల్
– సిబ్బంది కంప్లైంట్‌తో పోలీసు కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏమీరా.. బాలరాజు.. ఇదీ అని అసహ్యించుకునే ఓ వ్యక్తి ప్రవర్తించాడు. మద్యం మత్తులో 108 అంబులెన్స్ సర్వీసుకు ఫేక్ కాల్ చేశాడు. ఒకటి కాదు రెండు సార్లు ఇలాగే చేయడంతో విసుగెత్తిన 108 సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో జరిగింది. ఎస్ఐ గప్పార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని మంతన్‌గౌడ్ గ్రామానికి చెందిన బోయిని బాలరాజ్ శుక్రవారం ఉదయం 7 తన అమ్మ ఫకిరమ్మకు ఆరోగ్యం బాగాలేదు వెంటనే రావాలని 108కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలరాజుకు ఫోన్‌ చేయగా తాను అందుబాటులో లేనని.. మా అమ్మ ఇంట్లో ఉంది.. తీసుకెళ్లానని సమాధానం ఇచ్చాడు. దీంతో 108 సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు.

మళ్లీ ఉదయం 10గంటల ప్రాంతంలో బాలరాజు 108కు ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం బాగాలేదంటూ తెలిపాడు. ఈ సారి మరో 108 సిబ్బంది గ్రామానికి వెళ్లారు. వారికి కూడా మళ్లీ అదే సీన్ రీపీట్ అయ్యింది. దీంతో బాలరాజు ఆచూకీని తెలుసుకున్నారు. బషీరాబాద్‌ లో ఉన్నట్లు గుర్తించి పట్టుకుని నిలదీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉండగా డ్రైవర్ రాజు, టెక్నీషియన్ చౌహాన్ సంజులు బషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గఫ్పార్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

డేంగీ కలకలం..!