భళా.. ఎమ్మెల్యే బీఎంఆర్..!
– తాండూరుకోసం రూ. 100 కోట్ల ప్రతిపాదన
– సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి ప్రత్యేక భేటి
– బస్తీబాట సమస్యల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనదైన శైలి చూపిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులను రాబట్టేందుకు విశేష కృషి చేస్తున్నారు. తాజాగా తాండూరును ప్రగతి బాటలో నడిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందు రూ. 100 కోట్ల నిధుల మంజూరు ప్రతిపాదనను ఉంచారు. సోమవారం హైదరాబాద్‌తో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక భేటీ అయ్యారు. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో బస్తీబాట ద్వార పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రద్ద వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాండూరులోని కాగ్నానది నుంచి మున్సిపల్ వార్డుకు తాగునీటిని అందించే పైపులైన్, చెక్ డ్యాంల నిర్మాణాం చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎంకు తెలిపారు.

అదేవిధంగా తాండూరు మున్సిపల్ పరిధిలో అధిక వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలో ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి వర్షపు నీరు గొల్ల చెరువు, చిలుక వాగులో కలిసే చేయాల్సివస్తుందని వివరించారు. ఇందుకు సుమారు రూ. 100 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుళ్లారు. ఈ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధికి చూపిస్తున్న శ్రద్దను అందరు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో డీసీసీబీ వైస్ చైర్మన్ గా నియామకమైన సంగెం రవీందర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

