అందరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

అందరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
– పేదల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– జమియతి ఏ ఉలేమా మెగా వైద్య శిబిరంకు స్పందన
– 1100ల మంది వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యంపై అందరు శ్రద్ధ వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం జమియతే ఏ ఉలేమా హిందూ వికారాబాద్ జిల్లా, ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జమియతే ఏ ఉలేమా హింద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జమియతే ఏ ఉలేమా హింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ తో పాటు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత జీవన తరుణంలో అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వ మంచాలన్నారు. పేదల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చె సుకోవాలని సూచించారు.

1100 మందికి పరీక్షలు
ఈ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. తాండూరుతో పాటు మహబూబ్ నగర్, సంగారెడ్డి, జహీరాబాద్, అచ్చంపేటతో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు. హైదరాబాద్ కు చెందిన కేర్ హాస్పిటల్, ఇంటిగ్రో హస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్, నూట్రిఫిల్ సంస్థల సహాకారంతో ఎముకలు, ఛాతి, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కిడ్నీలు, కార్డియాలజీ తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు.

అదేవిధంగా బీపీ, షుగర్, మూత్ర పరీక్ష, కిడ్నీ పనితీరు, బరువు వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఉదయం నుంచి జరిగిన శిబిరంలో దాదాపు 1100ల మందికి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ఆల్మాస్ గ్రూఫ్ ఆఫ్ ఇన్సిట్యూషన్స్ చీఫ్ ప్రమోటర్ తాహీర్ ఖురేషీ, జమియతే ఏ ఉలేమా, ముక్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు