డా.జయప్రసాద్ కు మహేందర్ రెడ్డి పరామర్శ
– తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన చీఫ్ విప్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ ను పరామర్శించారు. ఇటీవల జయప్రసాద్ తండ్రి ఎం.పరంధాములు(రిటైర్డ్ డీఏఓ-సంగారెడ్డి) స్వర్గస్తులయ్యారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మహేందర్ రెడ్డి జయప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. ఆయన తండ్రి పరంధాములు చిత్రపటానికి మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం డా.జయప్రసాద్ ను పలకరించి పరామర్శించారు. చీఫ్ విప్ వెంట ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, డా. సంపత్ కుమార్, సిద్రాల శ్రీనివాస్, జర్నలిస్టు శ్రీనివాస్ చారి, నాయకులు బిడ్కర్ రఘు, బీదర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

