దేవాలయాల్లో దాడులపై సిట్‌ సిట్‌ ఏర్పాటు చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవాలయాల్లో దాడులపై సిట్‌ సిట్‌ ఏర్పాటు చేయాలి
– సమగ్ర విచారణతో నిందితులను శిక్షించాలి
– తాండూరు సబ్‌ కలెక్టర్‌కు హిందూ వాహిని వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సిట్‌ ఏర్పాటు చేయాలని తాండూరు హిందూ వాహిని, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హిందూ వాహిని, హిందూ సంఘాల నాయకులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై రోజు రోజుకు దాడులు జరగడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఇతర మతస్తులు కించపరిచే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.

కావున హిందూ దేవాలయాలపై, హిందువులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. దాడులకు పాల్పడుతున్న నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయలకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, తెలంగాణ సాధు పరిషత్, హిందూ వాహిని, భాజపా, అలాగే వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం