ప్రాణం తీసే దారం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రాణం తీసే దారం..!
– చైనా మాంజా విక్రయాలపై పంజా
– ముగ్గురు వ్యాపారులపై కేసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్రాంతి సందడి మాటున ప్రాణాల మీదకు తెస్తోన్న చైనా మాంజా విషయంలో తాండూరు పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు.

యమపాశాల్లాంటి చైనా మాంజాను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గుట్టుగా ఇండ్లలో నిర్వహించే విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చైనా మాంజాలను స్వాదీనం చేసుకున్నారు. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన డ్రైవర్‌ పని చేసే వన్నాడి శ్రీకాంత్ తన ఇంట్లో చైనా మాంజా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మెడికల్ షాపు నిర్వహించే నెల్లి ఆశీర్వాదం కూడా చైనా మాంజా విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. పాన్‌ షాపు నిర్వహించే వన్నాడి జగదీష్‌ వద్ద కూడా చైనా మాంజా గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు చేయగా వారి వద్ద నుంచి చైనా మాంజాను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

పట్టణ వాసులారా.. జాగ్రత్త..!