ప్రణాళికబద్ధమైన అభివృద్దే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రణాళికబద్ధమైన అభివృద్దే ధ్యేయం..!
– మాస్టర్ ప్లాన్‌తో తాండూరుకు మహర్దశ
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– పట్టణంలో రెండో రోజు కొనసాగిన సర్వే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రణాళికబద్ధంగా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. అమృత్ భారత్ 2.0కింద తాండూరు పట్టణంలో అమలు చేయబోతున్న మాస్టర్ ప్లాన్ సర్వే బుధవారం రెండో రోజు కొనసాగింది. సర్వే ఆఫ్ ఇండియా బృందం, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సర్వే చేపట్టారు. పట్టణంలోని సరిహద్దు ప్రాంతాలలో కొనసాగిన సర్వేను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పరిశీలించారు.

సర్వేలో ఏయే అంశాలను గుర్తిస్తున్నారు..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని బృందం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సర్వే సవ్యంగా కొనసాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణాన్ని మోడల్ గా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ చేపట్టడం జరుగుతుందన్నారు. వసతులు, సౌకర్యాల మెరుగుతో తాండూరుకు మహర్ధశ వస్తుందని దీమా వ్యక్తం చేశారు. వచ్చే 25 ఏండ్లకు సరిపడా వసతులు, సదుపాయాలను కల్పించేందుకు సర్వే దోహదపడుతున్నారు. ప్రణాళికబద్ధంగా తాండూరును అభివృద్ధి పరచడమే ధ్యేయమన్నారు. మరోవైపు పట్టణంలో రెండో రోజు కొనసాగిన సర్వేలో సరిహద్దు ప్రాంతాల్లోని 15 చెక్ పాయింట్లు గుర్తించడం జరిగిందని సర్వే బృందం తెలిపింది.

ఇదికూడా చదవండి…

ఘనంగా దీపావళీ సంబరాలు