ఘనంగా దీపావళీ సంబరాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా దీపావళీ సంబరాలు
– గాంధీనగర్ అంగన్వాడిలో శోభ
-పాల్గొన్న కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో దీపావళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఉత్సహంగా జరుపుకున్నారు. ముందుగా అంగన్ వాడి కేంద్రంలో లక్ష్మీదేవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో కలిసి టపాసులు పేల్చి.. కాకర పువ్వొత్తులు కాల్చి.. ఆనందంగా గడిపారు.

ఈ సందర్బంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ రాముడు. రావణుడు మద్య జరిగిన యుద్ధంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళీ పండగను జరుపుకుంటామని తెలిపారు. ఆ విధంగా సత్యభామ, శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుని వధించి.. ప్రజల కష్టాలను దూరం చేసినందుకు దీపావళీని జరుపుకునే సంప్రదాయ పాటిస్తున్నామన్నారు. ప్రజలు ఆనందంగా, సంతోషంగా దీపావళీ సంబరాలను జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలకు వాయినాలు, చిన్నారులకు స్వీట్లు అందించి పండగ శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్ వైజర్ సుశీల, టీచర్ రాధ, ఆయమ్మ అనిత, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కుల గణనకు రెడీ..!