గ్రూప్-3 పటిష్ట భద్రత
– పోలీస్టేషన్లో స్ట్రాంగ్ రూం పరిశీలన
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెలలో జరిగే గ్రూప్- 3 పరీక్షలకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈనెల 17, 18వ తేదిలలో జరిగే గ్రూప్-3 పరీక్షా ప్రశ్నా పత్రాలను భద్ర పరిచేందుకు పోలీస్టేషన్లో స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గ్రూప్ -3 పరీక్షలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. మరోవైపు గ్రూప్ -3 పరీక్షలను పురస్కరించుకుని తాండూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదికూడా చదవండి…

