నిరసన గళమెత్తిన ఉద్యోగులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిరసన గళమెత్తిన ఉద్యోగులు..!
– అధికారులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
– తాండూరు మున్సిపల్ ఉద్యోగుల నిరసన
– నిరసనకు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి చేయడం పట్ల తాండూరు మున్సిపల్ ఉద్యోగులు నిరసన గళమెత్తారు. మంగళవారం ఉద్యోగులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి.. పెన్‌డౌన్ చేపట్టారు. కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్ తదితరులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసనకు మున్సిపల్ పరిధి 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మద్దతు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే అధికారులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అధికారులపై దాడులకు పాల్పడితే ఉద్యోగులకు భయాందోళనకు గురవుతారని అన్నారు. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్ ఐ అశోక్ కుమార్, అధికారులు ఉమేష్ కుమార్, రాజేంద్రప్రసాద్, విట్టల్, బంటు బిచ్చప్ప, మెప్మా కోఆర్డినేటర్ విశాల, రాములు, నర్మదా, సంగమేశ్వర్, యాదగిరి, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

లగచర్లలో.. హైటెన్షన్..!