ఆహ్లాదం కరువైంది.. కంపే ఇంపయ్యింది
– ఆధ్వాన్నంగా మున్సిపల్ పార్కులు
– పట్టించుకోని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మానసిక ప్రశాంతతకు నిలయాలకు ఉండే పార్కులు ఆధ్వాన్నంగా మారాయి. పచ్చదనంతో నిండాల్సిన ప్రాంతాలు కంపే ఇంపయినట్లుగా తయార్యాయి. తాండూరు పట్టణంలోని శాంతినగర్, ఇందిరానగర్, యశోధనగర్ తదితర ప్రాంతాల్లోని ఉద్యాన వనాల్లో ఆహ్లాదం అటకెక్కింది. పచ్చదనానికి బదులుగా పిచ్చి మొక్కలు, మురుగు నీరుతో శాంతినగర్ పార్కు దర్శనమిస్తోంది. దీంతో కొంతసేపైనా సేదతీరుదామని వచ్చే ప్రజలు వెనక్కి తిరిగి వెళుతున్నారు. ఇక శాంతినగర్, యశోధనగర్‌లోని పార్కులలో వాకింగ్ ట్రాక్‌లు ధ్వంసమైపోయాయి.
శాంతి నగర్ పార్కులో వాకర్లు రావడమే మానేశారు. ఇందిరానగర్‌లోని పార్కులో పెద్ద చెట్లు ఉన్నప్పటికి ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి కళాహీనంగా తయారైంది. ఆయా పార్కుట్లో చిన్న పిల్లల ఆట వస్తువులు సైతం పాడైపోవడంతో చిన్నారులు పార్కుల్లోకి రాలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ కింద పార్కుల అభివృధ్దికి నిధులు కేటాయిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం విశేషం.
