అధికారులపై దాడి బీఆర్ఎస్ కుట్రే..!
– సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే యత్నం
– దాడిని ఖండించిన కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి.. పెన్‌డౌన్ చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా చైర్మన్, అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును ఖండించారు. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతల కుట్ర ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును బద్నాం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చేసిన కుట్రలో భాగంగా జరిగిందని ఆరోపించారు. బీఆర్ఆర్ గుండాలతో అధికారులపై దాడులు చేయించడం సముచితం కాదన్నారు. అధికారులు ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తారని అన్నారు. రాజకీయ ముసుగులో అధికారులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

