కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

ఆరోగ్యం జాతీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!
– చలికాలంలో కూడా ప్రయోజనాలు
– రక్తపోటు, గుండె సమస్యలు అదుపు
– ఇమ్యూనిటీ పెంచే పోషకాలు
దర్శిని ప్రతినిధి : సాధారణంగా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని అందరికి తెలిసిందే. కాని శీతాకాలంలో తాగడం మంచిది కాదని ఉన్న అపోహలను నిపుణులు కొట్టిపారేస్తున్నారు. చలికాలంలో కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్‌లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. చాలా మంది చలికాలంలో చర్మం పొడిబారడం, కష్టపడటం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.కానీ కొబ్బరి నీరు చర్మాన్ని పుష్కలంగా హైడ్రేట్ చేసి, ఈ సమస్య నుండి బయటపడేందుకు సాయపడుతుంది. చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. దాంతో డీహైడ్రేషన్‌ సమస్యలు వస్తాయి. కానీ కొబ్బరి నీరు చలికాలంలో కూడా శరీరానికి హైడ్రేషన్ అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే చలికాలంలో వచ్చే చర్మ పగుళ్ళు, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. చలికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. పౌష్టికాహార నిపుణులు కూడా చలికాలంలో కొబ్బరి నీరు తాగడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం కంటెంట్‌ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కొబ్బరి నీళ్లతో పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కొబ్బరి నీరు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ, కడుపు నొప్పులు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చలికాలంలో వచ్చే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా కొబ్బరి నీరు తాగడం ద్వారా అదుపులో ఉంటాయి.

ఇదికూడా చదవండి…

బల్దియాలో సర్వర్ డౌన్..!