ఒకే వాట్సాప్‌ను నాలుగు ఫోన్‌లలో వాడొచ్చు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఒకే వాట్సాప్‌ను నాలుగు ఫోన్‌లలో వాడొచ్చు..!
– కీలక ఆప్‌ డేట్ తీసుకవచ్చిన సంస్థ
– యూజర్లు ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే
దర్శిని డెస్క్‌: ప్రపంచంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌ సంస్థ వారి కోసం కొత్త కొత్త ఫీచర్లు, ఆప్‌డేట్‌లను తీసుకవస్తోంది. తాజాగా యూజర్ల కోసం కీలక అప్‌డేట్ తీసుకవచ్చింది. దీని ద్వారా ఒకే వాట్సాప్‌ ఖాతాను నాలుగు ఫోన్లలో కూడా వినియోగించుకునేలా వెసులుబాటును అందిస్తోంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఈ ఫీచర్ మొదట బీటా టెస్టింగ్ ద్వారా విడుదల చేశారు. అయితే ఇప్పుడు యూజర్లందరూ ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌తో మీరు ప్రతి లింక్ చేయబడిన పరికరంలో స్వతంత్రంగా పని చేయగలుగుతారు. ప్రాథమిక పరికరంలో నెట్‌వర్క్ కనుగొనబడనప్పుడు ఇతర ద్వితీయ పరికరాలలో ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. అదేమిటంటే వాట్సాప్ ‘కంపానియన్ మోడ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ఎక్కువ డివైజ్‌లలో లాగిన్ కావొచ్చు. అంటే, కంపానియన్ మోడ్ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ఇతర పరికరాలలో కూడా అదే WhatsApp ఖాతాను ఉపయోగించగలరు.

ఎలా పనిచేస్తుందంటే
WhatsApp ఖాతాను అనేక మార్గాల్లో లింక్ చేయవచ్చు. మీరు మీ ప్రాథమిక డివైజ్‌ను మరొక డివైజ్‌లో WhatsApp ఖాతాతో లింక్ చేయాలనుకుంటే, మీరు ద్వితీయ డివైజ్ WhatsApp అప్లికేషన్‌లో ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇప్పుడు మీ ప్రాథమిక డివైజ్‌లో అందుకున్న OTPని నమోదు చేయాలి. అదేవిధంగా, ఇతర డివైజ్‌లు కూడా ప్రాథమిక డివైజ్‌లోని కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లింక్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ వినియోగదారులకు పలు రకాలుగా ఉపయోగపడవచ్చు.