నోరు అదుపులో పెట్టుకోండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నోరు అదుపులో పెట్టుకోండి..!
– చైర్‌ పర్సన్‌ను విమర్శించే అర్హత లేదు
– నిరాధార ఆరోపణలు మానుకుంటే మంచిది
– కౌన్సిలర్ తీరును ఖండించిన బిర్కడ్ రఘు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు అధ్యక్షులు బిర్కడ్ రఘు ఓ ప్రకటనలో హెచ్చరించారు. 20వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే సహాకారంతో చైర్ పర్సన్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. గతంలో చైర్‌ పర్సన్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు చైర్ పర్సన్ వెంట ఉండి లబ్దిపొందిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు.

చైర్ పర్సన్‌ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని విమర్శలు చేస్తున్న మీరు.. వార్డులోని పాఠశాలలో, అంగన్ వాడిలో, ఆర్పీల కార్యక్రమాల్లో ముందుండి హాడావుడి చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేది మీరు కాదా అని విమర్శించారు. వార్డులలో బిల్లులు ఇవ్వడం లేదంటూ.. కమీషనర్‌తో కుమ్మక్కు అయ్యారంటూ నిరాధార ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు. చైర్‌ పర్సన్‌ను విమర్శించే అర్హత మీకు లేదని, నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మరోసారి పార్టీ చైర్ పర్సన్‌పై విమర్శలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

రేపే గొప్ప ప్రారంభం..!