అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీయొద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీయొద్దు
– డీజీపీ ఆంక్షలు ఉపసంహరించుకోవాలి
– తాండూరు డీఎస్పీకి స్వాములు, నేతల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని తాండూరు అయ్యప్ప స్వాములు, పలువురు నాయకులు అన్నారు.

శుక్రవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్యకు స్వాములు, నేతలు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు శాఖ లో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మలధారణ స్వాములకు యూనిఫామ్ ధరించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పెట్టిన ఆంక్షలు ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, పలు పార్టీల నాయకులు, హిందు సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఫస్ట్ డే పంచాయతీ జోష్‌..!