రేపే గొప్ప ప్రారంభం..!
– ముస్తాబైన వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
– హాజరు కానున్న స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహా
– జిల్లాలో మొట్ట మొదటిసారిగా గుండెపోటుకు వైద్య సేవలు
– ఆసుపత్రిలో చైర్మన్, ఎండీ విఠల్ నాయక్ పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు ముస్తాబైంది. రేపు శుక్రవారం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. గురువారం ఆసుపత్రి చైర్మన్, ఎండీ, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. సతీమణి కిష్టమ్మ, కూతురు ప్రశాంతిలతో పాటు వైద్యులు డా. చందులాల్ నాయక్, డా.రవీంద్ర నాయక్, వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో 100 పడకలతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వికారాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా గుండె పోటు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు కిడ్నీ, ఊపిరితిత్తుల రోగాలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు తాండూరు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

