ఆకలి తీర్చడంలో ఆత్మ సంతృప్తి
– అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల ఆకలి తీర్చడంలో ఆత్మ సంతృప్తి లభిస్తుందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అయ్యప్ప స్వామి జన్మనక్షత్రం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దైవభక్తితో పాటు రోగుల ఆకలి తీర్చడంలో ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షులు వెంకట్ రావు, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్, వైద్యులు ఆనంద్ గోపాల్ రెడ్డి, నరేష్, మధు యాదవ్, గోపాల్, మల్లన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.



