ప్రతి గుండెను కాపాడాలి..!
– రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
– వినాయక హస్పిటల్ను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తాండూరులో అట్టహాసంగా వినాయక హాస్పిటల్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మొట్ట మొదటి సారి అందుబాటులోకి తెచ్చిన గుండె వైద్య సేవలతో అందరిని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, గిరిజన నాయకులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. తాండూరులో కార్పోరేట్ ఆసుపత్రిని ప్రారంభించడం.. అందులో మొట్ట మొదటి సారి జిల్లాలోనే గుండె వైద్య సేవలను అందుబాటులోకి తీసుకరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని తెలిపారు. గుండె సంబంధిత రోగులకు ఆధునిక వైద్య సేవలతో ప్రతి ఒక్కరిని కాపడాలని అన్నారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్, ఎండి విఠల్ నాయక్, వైద్యులు డా. చందులాల్ నాయక్, డా. రవీంద్ర నాయక్ లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, డా. సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత, పూజ రజనీ కాంత్, మమత, మహిళ నాయకులు అనురాధ, గాజుల మాధవి, విఠల్ నాయక్ సతీమణి కిష్టమ్మ, కూతురు ప్రశాంతి. యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, పలువురు గిరిజన సంఘాల నాయకులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తాండూరులో వినాయక ఆసుపత్రిని ప్రారంభించిన విఠల్ నాయక్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదికూడా చదవండి..

