కలిపేస్తే… కార్పోరేషన్..!
– తాండూరు మున్సిపల్ అప్‌గ్రేడ్‌పై ఫోకస్
– అర్హతలపై కసరత్తు చేస్తున్న అధికారులు
– అదే జరిగితే వార్డులు పెరిగే చాన్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో తాండూరు మున్సిపల్‌ను విస్తరించి కార్పోరేషన్‌గా మార్చేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు అధికారులు మున్సిపల్ కార్పోరేషన్‌గా మార్చే అర్హతలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ఏర్పడిన మున్సిపాల్టీ కార్పోరేషన్‌గా పురోగతి చెందే అవకాశాన్ని అందుకోబోతోంది. ప్రస్తుతం గ్రేడ్-2 మున్సిపాలిటీగా కొనసాగుతోంది. పట్టణంలో 71వేల జనాభా, 36 వార్డులు ఉన్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, 200పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, 100పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూల్స్, డిఎస్పీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్, సబ్-రిజిస్ట్రార్, మైన్స్ ఏడీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ వంటి పలు డివిజనల్ కార్యాలయాలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తాండూరు మున్సిపాలిటీకి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
గతంలోనే ప్రతిపాదనలు
తెలంగాణ ఏర్పడిన తరువాత రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్‌కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, రసూల్‌పూర్ ఆంజనేయస్వామి ఆలయం, కోకట్ రోడ్డు సాయిబాబా మందిర ప్రాంతాలు విలీనమయ్యాయి. ఆ తరువాత తాండూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే ప్రతిపాదనలు సిద్దం చేశారు. కార్పోరేషన్ ఏర్పాటుకు కావాల్సిన అర్హతలకు అనుగుణంగా లక్ష జనాభా, ఆదాయం, వసతుల అంశాలతో అప్పటి ప్రభుత్వానికి ప్రణాళికలు సిద్దం చేసి పంపించారు. కాని కార్యరూపం దాల్చలేదు. గతయేడాది జులై మాసంలో కూడా వీలిన గ్రామాలను గుర్తించి ఆన్ లైన్ మ్యాప్‌ను సిద్దం చేశారు.
వీలినమయ్యే ప్రాంతాలివే..
ప్రస్తుతం 36మంది కౌన్సిలర్లు ఉండగా కార్పోరేషన్‌గా మారితే వార్డుల సంఖ్య 50 దాటే ఛాన్స్ ఉంటుంది. పట్టణ పరిధి కూడా విస్తరిస్తోంది. పట్టణ జనాభాతోపాటు శివారులో ఉన్న గ్రామాలను కలిపి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తాండూరు గౌతాపూర్, అంతారం, అంతారంతండా, ఖాంజాపూర్, అల్లాపూర్(ఎస్), చెనిగే్‌షపూర్, కోణాపూర్, గోపన్‌పల్లి, యాలాల మండలం కోకట్, బషీర్‌మియాతండా, పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామాలు విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదికూడా చదవండి…

