మున్సిపల్ మురుగు ఇబ్బందులకు చెక్..!
– తాండూరు పట్టణంలో అండర్ డ్రైనేజీ
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పెషల్ ఫోకస్
– రూ. 480 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రధాన నగరాలలో మాదిరిగా తాండూరు మున్సిపల్ పరిధిలో మురుగు సమస్యకు చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. బస్తీబాటతో పాటు పలు కార్యక్రమాలతో కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలో మురుగు సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అండర్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకరావాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేసి ప్రణాళికలు సిద్దం చేశారు.
తాజాగా సోమవారం హైదారాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ అధికారులు అండర్ డ్రైనేజీ వ్యవస్థ కోసం తయారు చేసిన ప్రణాళికలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండర్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందని, దీనికి కావాల్సిన నిధులపై సమీక్ష జరిపారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థకు రూ. 480 కోట్ల అంచనా విలువతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు అండర్ డ్రైనేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ మణిపాల్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

