వ్యాక్సీనేషన్‌కు భయపడోద్దు
– అవగాహన కల్పించిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా వ్యాక్సీనేషన్‌ను భయపడకుండా ధైర్యంగా వేయించుకోవాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం వార్డులోని గాంధీనగర్‌లో ఇంటింటికి వ్యాక్సీనేషన్ స్పెషల్ డ్రైవ్‌పై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా నియంత్రణ కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సీనేషన్ ఇస్తోందన్నారు. 18 ఏండ్లు నిండిన వారంతా టీకా వేయించుకోవాలన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికి ఉచితంగా అందిస్తున్న వ్యాక్సీనేషన్‌ను ధైర్యంగా ముందుకొచ్చి వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు.
