ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..!
– తాండూరు పోలీసు శాఖకు బారికేడ్ల వితరణ
– ప్రైవేటు స్కూల్స్, కాలేజీ అసోసియేషన్ల చేయూత
– అభినందించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రిచండంలో భాగంగా మేము సైతం అంటూ తాండూరు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల యజమాన్యం అసోసియేషన్లు ముందుకు వచ్చాయి. గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సమక్షంలో పట్టణ పోలీసు శాఖకు 20 నుంచి 30 వరకు ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ అందరి బాధ్యత అన్నారు. దీని కోసం ప్రైవేటు స్కూల్స్, కాలేజీ యజమాన్యం అసోసియేషన్లు బారికేడ్లను అందజేయడం అభినందనీయమని వారి చేయూతను కొనియడారు.

అదేవిధంగా అసోసియేషన్ల ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మాయిలు ఆకతాయిల నుంచి వేధింపులకు గురికాకుండా షీటీం ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకు, ఇతర వాహనాలను అందించరాదని సూచించారు. స్కూల్ పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపల్ నరేందర్, భాష్యం కాలేజీ కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ందర్ రెడ్డి, కోశాధికారి మోహన్ కృష్ణ గౌడ్, స్కూల్ కరెస్సాండెంట్స్ శివ, సతీష్, కిరణ్ కుమార్, ఇందూరు రాములు, పెరుమాళ్ల వెంకట్ రెడ్డి. అభిలాష్ రెడ్డి, సోహైల్, యూనుస్, వాహిద్, బాలస్వామి, కల్పన, కవిత, రమేష్, సోనియా భేగం, సలీం, వెంకటేష్, గణేష్, ప్రైవేటు కాలేజీ యజమాన్య సభ్యులు రంగారావు, సంగీత, ఆనంద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..!