ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు
– 23 రూట్లలో అధికారుల నియామకం
– పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
– సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ
– జిల్లా ఆడిషనల్ ఎస్పీ మురళీధర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీధర్ అన్నారు. బుధవారం డిస్ట్రీబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు పోలింగ్‌ నేపథ్యంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సుమారు 400ల మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏఎస్పీ, డీఎస్పీలతో పాటు మొత్తం 23 రూట్లలోని పోలీసు అధికారులు, మోబైల్ బృందాలను నియమించడం జరిగిందన్నారు.

మండల కేంద్రంలో ఇను స్పెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా స్ట్రాటికల్ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఆర్మీ ఫోర్స్ ఎన్నికల్లో కూడ పనిచేస్తారని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలు విధుల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!