వీఆర్వో ఉద్యోగాలకు మార్గదర్శకాలు..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వీఆర్వో ఉద్యోగాలకు మార్గదర్శకాలు..!
– దరఖాస్తు, ఎంపిక విధానంను ప్రకటించిన సర్కారు
– అర్హులు.. వేతనం అమలు ఖరారు
– నోటిఫికేషన్ ఎప్పుడు రానుందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాష్ట్రం లో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది. మొత్తం 10,956 ఉద్యోగాలను భర్తి చేయనుండగా ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన వీఆర్ఓ, వీఆర్ఏలను గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు. వీరితో పాటు మరో 8,000 మందిని కూడా నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ గ్రామ రెవిన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని , కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి , భర్తీ చేయనుంది. రెవిన్యూ అధికారులను నియమించి , తద్వారా రెవిన్యూ వ్యవస్థ ను పునరుద్దిస్తాము అని , గ్రామాలలో ప్రభుత్వ భూములకి రక్షణ , రెవిన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయ పరుస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

మార్గదర్శకాలు ఇలా..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు.
కేటగిరీ వారీగా పోస్టులను రిజర్వ్ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex-సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :
వచ్చే యేడాది వీఆర్ఓ,వీఆర్ఏ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించబోతోంది. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పదవ తరగతి , ఇంటర్మీడియట్ / డిగ్రీ సర్టిఫికెట్ లు , కుల దృవీకరణ పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అవసరం అగును. వ్రాత పరీక్ష నిర్వహించి , పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన నియమకాలు చేపట్టి.. నెలకు 45,000 /- రూపాయల వరకు జీతం అందించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఇదికూడా చదవండి…

వెల్లుల్లిలో ఖతర్నాక్ బెనిఫిట్స్..!