రిజర్వేషన్ల టిక్కెట్లలో మార్పులు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

రిజర్వేషన్ల టిక్కెట్లలో మార్పులు..!
– కన్ఫర్మ్‌ అయినా తేదిలను మార్చుకోవచ్చు
– రైల్వే శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం
– ప్రయాణికులకు కలిగే ఉపయోగాలు ఇవే..
దర్శిని డెస్క్ : రైల్వే రిజర్వేషన్‌ ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకొని మరో తేదీకి మార్చుకోవాల్సి వస్తే ఉసూరుమంటూ అప్పటికే బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసి కొత్త టికెట్లను బుక్‌ చేస్తుంటాం. దీని కారణంగా డబ్బు, సమయం వృథా అవుతుంది.

అయితే ఇక నుంచి అలాంటి బాధలు లేకుండా ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. క్యాన్సిలేషన్ల పేరిట ఇకపై మీరు ఎలాంటి డబ్బు నష్టపోకుండా మీకు కావాల్సిన తేదీలకు టికెట్లను మార్చుకోవచ్చునని ప్రకటించింది.

రిజర్వేషన్ టికెట్ల తేదీని ఆన్‌లైన్‌లోనే మార్చుకునే సౌకర్యాన్ని అందించేందుకు రైల్వే బోర్డు సిద్ధమవుతోంది. 2026 జనవరి నాటికి ఈ ఫీచర్‌ రావొచ్చు. ప్రస్తుతానికి ప్రయాణ తేదీ మార్చుకోవాలంటే టికెట్‌ రద్దు చేసుకుని కొత్తగా బుక్‌ చేసుకోవాలి. కొత్త విధానంలో ఉచితంగానే మార్చుకోవచ్చు. అయితే, ఇది టికెట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
kvcs
రైలు ప్రయాణానికి 12 గంటల నుంచి 48 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే టిక్కెట్ ధరలో 75 శాతం మాత్రమే ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తోంది. ఇక జర్నీకి 4 గంటల నుంచి 12 గంటల ముందు టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మరింత సొమ్మును కోల్పోవాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్ చార్ట్ తయారు చేశాక టిక్కెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్స్‌ను ఉండవు. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందుల్లో చాలా మటుకు తొలగిపోనున్నాయి. మార్చిన కొత్త తేదీ నాటికి కన్ఫర్మ్‌ టికెట్‌ లభిస్తుందన్న హామీ లేదని, అది సీటు/బెర్త్‌ లభ్యత ఆధారంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి….

టపాసుల దుకాణాలపై నిషేధం..!