తాండూరులో సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం
– రేపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
– నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు  గురువారం తాండూరు నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు ఉదయం 10-30గంటలకు పట్టణంలోని 8వ వార్డు రాజీవ్ కాలనీలో, 11గంటలకు పాత తాండూరు వార్డు నెంబర్ 17లో, 11-30గంటలకు తాండూరు మండలం చెనెష్పూర్ గ్రామంలో, మధ్యాహ్నం 12-30గంటలకు గౌతాపూర్ గ్రామంలో, 1-30గంటలకు పెద్దేముల్ మండల కేంద్రంలో, 2-30గంటలకు పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.

ఇదికూడా చదవండి…

ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు