నల్ల జీలకర్రలో అద్భుతాలు..!
– ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దివ్య ఔషధం
– కడుపు, మూత్రపిండాల స్యమలకు చెక్
దర్శిని డెస్క్: వంటలో రుచికి ఉపయోగించే జీలకర్ర గురించి అందిరికి తెలిసిందే. చాల తక్కువ మందికి తెలిసిన నల్ల జీలకర్ర కూడా మనిషి ఆరోగ్యానికి అద్భుత ప్రయోజాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్రలో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. చేదు జీలకర్రగా పేరున్న వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, నల్ల జీల కర్రలో ఉండే రసాయనిక పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయని, దీని వల్ల దాదాపు అన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను, మూత్రపిండాల సంబంధిత సమస్యలను, కాలేయ సంబంధిత సమస్యలను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర దివ్య ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించంలో, బీపీని నియంత్రించడంలో, చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఈ నల్ల జీలకర్ర దోహదపడుతుంది. శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
నల్ల జీలకర్రను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలోనూ నల్ల జీలకర్ర ముందుంటుంది. నల్ల జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రరను వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. దగ్గు, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలోనూ నల్ల జీలకర్ర ముందుంటుంది. నల్ల జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రరను వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి.
నోట్: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించడం జరిగింది. వినియోగించే వుందు నిపుణులను సంప్రదించడం మంచింది.
ఇదికూడా చదవండి…

