జాజికాయలో ఔషదగుణాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

chai jr
జాజికాయలో ఔషదగుణాలు..!
– కీళ్లు, కండరాల నొప్పులు పరార్‌
– రాత్రి ప్రశాంత నిద్రకు బెస్ట్ మెడిసిన్‌
– బోలెడు లాభాలు తెలుసుకోండి
దర్శిని డెస్క్ : సుగంధ ద్రవ్యాల్లో పేరుగాంచింది జాజికాయ. ఈ జాజికారలో ఎన్నో ఔషదగుణాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనిని వాడడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని, అవి అందరు తెలుసుకోవాలని అంటున్నారు. జాజికాయ ఫైబర్ అద్భుతమైన మూలం. ఉరుకుల పరుగుల జీవితంలో మనకున్న ఒత్తిడిని తగ్గించడంలో జాజికాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, జింక్, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ మరియు మెగ్నీషియం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో జాజికాయను వాపు, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, పుండ్లకు చికిత్స ఔషధంగా ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకుని తాగితే ప్రశాంతంగా, తొందరగా నిద్ర పడుతుంది.

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జాజికాయ క్యాన్సర్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.జాజికాయతో పెద్దప్రేగు క్యాన్సర్ ను నివారించగలదని పలు పరిశోధనలు వెల్లడించాయి. అంతేకాదు, ఇది కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారాలు అవయవాలలో విషాన్ని పెంచుతాయి. అయితే జాజికాయ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగించడానికి ఇది సహాయపడుతుంది.

జాజికాయ మీ మేధస్సుకు పదును పెట్టడమే కాకుండా మీ కళ్లకు పదును పెడుతుంది. జాజికాయ పొడిని పేస్టులా చేసి కనురెప్పలు, కళ్ల చుట్టూ రాసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాదు, జాజికాయను ఆహారంలో బాగంగా చేర్చుకునే వారికి మతిమరుపు అనే బాధ ఉండదు.

జాజికాయ మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. నిరాశ, ఆందోళనలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమల నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనం చర్మానికి మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.

గమనిక: ఇది కేవలం మీ అవగాహన, చిన్నపాటి ఉపశమనం కోసం మాత్రమే.

ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం ప్రకారం.. కొందరు వైద్య నిపుణులు అందించిన సూచనలూ, సలహాల ప్రకారం, ప్రాక్టికల్‌గా చేసిన కొన్ని సర్వేల ఫలితం ఆధారంగా ఈ సమాచారాన్ని అందించబడమైనది.

ఇదికూడా చదవండి…

విద్యార్థుల చదువుకు తోడ్పాటు