బోనమ్మ సేవలో రొంపల్లి సంతోష్ కుమార్
– కోనాపూర్లో గుడి నిర్మాణంకు చేయూత
– తండ్రి జ్ఞాపకార్థం టైల్స్ అందజేత
– కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బోనమ్మ అమ్మవారి సేవకు తాండూరుకు చెందిన యువనాయకులు, తెలంగాణ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ముందుకు వచ్చారు. తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న బోనమ్మ అమ్మవారి గుడి నిర్మాణంకు తన తండ్రి స్వర్గీయ రొంపల్లి కిష్టయ్య జ్ఞాపకార్థం టైల్స్ ను అందజేశారు. ఆలయ కమిటి సభ్యులు, పెద్దల సమక్షంలో తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ బోనమ్మ గుడికి తండ్రి జ్ఞాపకార్థం చేయూతను అందించడం దైవ భాగ్యంగా బావించినట్లు తెలిపారు. సామాజిక సేవతో పాటు దైవ కార్యక్రమాలకు తన వంతు సహాకారం అందిస్తామని అన్నారు.
మరోవైపు దేవాలయ నిర్మాణానికి టైల్స్ అందించడం పట్ల రొంపల్లి సంతోష్ కు దేవాలయ కమిటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు రాజుగౌడ్, భాస్కర్, ఆలయ కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

