పారదర్శంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే
– పకడ్బందీగా అర్హుల వివరాల నమోదు
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లి, ఇతర వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సర్వే చేపట్టారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సర్వేలో పాల్గొని యాప్లో లబ్దిదారుల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక యాప్ ద్వారా లబ్దిదారుల ఎంపిక సర్వే చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్దిదారుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వేకు దరఖాస్తు దారులు సహకరించాలని కొ రారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలప్ప, అధికారులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

