అగ్రనేతలతో ఆత్మీయ కలయిక..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అగ్రనేతలతో ఆత్మీయ కలయిక..!
– స్పీకర్ ప్రసాద్, ఆర్.కృష్ణయ్యలకు సన్మానం
– ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్‌లకు శుభకాంక్షలు
– బీసీ సంఘం యువతనేత లక్ష్మణ్‌చారికి దక్కిన అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని అగ్రనేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్యలతో తాండూరు నియోజకవర్గంకు చెందిన బీసీ సంఘం యువనాయకులు లక్ష్మణ్‌ చారి ఆత్మీయ కలయిక జరిగింది. ఆదివారం వారితో పాటు తాండూరు, పరిగి, ఎమ్మెల్యేలు, వికారాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్‌లను కలిసి సన్మానించే అవకాశం దక్కింది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ్‌ చారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా మొదటి సారి ఆయనను కలిసి సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, యువ నాయకులు రినీష్‌ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ చారి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన అగ్రనేతలు ప్రసాద్ కుమార్, ఆర్.కృష్ణయ్యలతో పాటు ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించే అవకాశం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాలాల మండల మాజీ అధ్యక్షులు గాజుల మన్నన్, అక్కంపల్లి నగేష్‌, రాజు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పేదల ఆరోగ్యానికి పెద్దపీట..!