కిలోలు.. కిలోల గంజాయి..!
– బస్తాలలో నింపి గుట్టుగా రైల్లో రవాణా
– రూ.30 కిలోలను పట్టుకన్న ఎక్సైజ్ పోలీసులు
– పట్టుబడిన గంజాయి విలువ రూ.7.50లక్షలు
– వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు మార్గంలో కిలోలు.. కిలోల చొప్పుగా గుట్టుగా తరలిస్తున్న గంజాయి బస్తాలను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా ప్రాంతానికి చెందిన నిందితుడి నుంచి భారీగా 30 కిలోల గంజాయి బస్తాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు రైల్వే పోలీస్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ బీబీ కమల హాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎక్సెజ్ టాస్క్ ఫోర్స్ బృందం ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డిల నేతృత్వంలో తాండూరులోని రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు.
తాండూరు మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఒరిస్సాకు చెందిన శిబిరామ్ స్వాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంలో అతని బ్యాగులను సోదా చేశారు. బ్యాగులో 12 కిలోల ఎండు గంజాయిని గుర్తించారు. పూర్తిగా విచారంగా మరో బ్యాగులో 18కిలోల గంజాయిని గుర్తించి.. మిత్తం 30కిలోల గంజాయి బస్తాలను స్వాదీనం చేసుకున్నారు. తాండూరులో గంజాయిని ఓ వ్యక్తిని అందించేందుకు కోణార్క్ రైల్లో వచ్చాడని, ఈ క్రమంలో పట్టుబడినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి 30 కిలోల గంజాయి బస్తాల విలువ రూ.7లక్షల 50వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ బీబీ కమలహాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ లు అభినందించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఇదికూడా చదవండి…

