కేరళ కపుల్.. వేరీ జాయ్‌పుల్..!
– 70 ఏండ్ల వయస్సులో కూడ విదేశీ యాత్రలు
– 26 వ సారి యాత్రకు సిద్దమైన అన్యోన్య జంట
దర్శిని ప్రతినిధి: విహార యాత్ర ఎన్నో అనుభూతులను.. అనుభవాలను పంచే విహాంగ పల్లకి. ఆ పల్లకిలో పక్షుల్లా విహరించాలని చాలా మంది తహతహలాడుతారు. యువకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏడాదికి ఒకసారైనా విహారా యాత్రకు వెళుతుంటారు. ఇలాంటి యాత్రల ద్వారా మానసిక ఉల్లాసం.. ఉత్తేజం పొందుతారు. సరిగ్గా ఇలాంటి ఆనందాన్ని పొందుతున్నారు కేరళకు చెందిన ఓ వృద్ధ జంట. కేరళలో కాఫీ షాపు నడుపుతూ ప్రతి యేడాది విదేశాలను చుట్టొస్తున్నారు. తాజాగా 26వ విదేశీ యాత్రకు సిద్దమవుతున్నారు. పదండి మరి వారి వివరాలు.. వారి విదేశీ యాత్రలను తెలుసుకుందాం. 1994లో కేరళకు చెందిన కేఆర్ విజయన్(71) అతని భార్య మోహన(69)లు కొచ్చిలోని సలీం రాజన్ రోడ్ గాంధీనగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి కాఫీ షాపు ద్వారా తమ పిల్లలను ప్రయోజకుల్ని చేయడంతో పాటు సంసార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే ఇద్దరికి విహార యాత్రకు వెళ్లాలంటే అమితాశక్తి ఉండడంతో షాపునుంచి వచ్చిన ఆధాయంలో రూ. 300లు పక్కన పెట్టి యాత్రకు సిద్దమయ్యేవారు. అంతేకాకుండా ప్రతి యేడాది విదేశీ పర్యటన కోసం ఈ కాఫీ షాఫుకు అధిక సమయం వెచ్చించి మరీ డబ్బులను పోగేసేవారు. అలా పోగేసిన డబ్బులతో 25 ఏండ్ల నుంచి విదేశాలను చుట్టేసి వచ్చారు. 2007 ఈజిప్టుకు మొదటి విహార యాత్రకు వెళ్లారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రీయా, లండన్, సింగాపూర్, స్విడ్జర్‌లాండ్ చుట్టేసిన విజయన్ దంపతులు.
ప్రస్తుతం 70 ఏండ్ల వమస్సులో కూడ 26వ సారి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. 2020లో కరోనా రావడంతో వెళ్లలేక పోయారు. అయితే ఈ సారి వారు ఈనెల 21 నుంచి వారం రోజుల రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడి ప్రెసిడెంట్‌ను కలవాలన్నది ఆశ అని చెబుతున్నారు. ప్రతి యేడాది జంటగా వేళ్లే వీళ్లు ఈ సారి, పిల్లలు మనుమరాండ్లతో కలిసి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈజీగా విదేశాలను చుట్టి వస్తున్న ఈ జంటను చూసిన.. తెలిసిన వారంతా.. ఇది కదరా జీవితం అంటే.. అంటూ ఉదహరిస్తున్నారు.
అంతేకాదు.. కేరళ కపుల్.. వేరీ జాయ్‌పుల్..! అంటూ కితాబిస్తున్నారు. కెరేళ కపుల్ గురించి తెలుసుకున్న మీరు కూడ ఏడాది కోసారైనా యాత్రకు సిద్దం కావాలని ఆలోచిస్తున్నారు కదూ..!