ప్రేయ‌సీ పెండ్లిలో ప్రేమికుడి హాంగామా..!

జాతీయం తెలంగాణ

ప్రేయ‌సీ పెండ్లిలో ప్రేమికుడి హాంగామా..!
– షాక్ అయిన పెండ్లి కూతురు, బందువులు
– చివ‌ర‌కు పెద్ద‌ల పెండ్లికొడుకుతో పెళ్లి
– నెట్టింట వైర‌ల్ అయిన వీడీయో
ద‌ర్శిని బ్యూరో : సినిమాల‌లో ప్రేమించుకున్న హిరో.. హీరోయిన్ల ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌కుంటే ఎన్నో ఎత్తులు వేసి ప్రేయ‌సిని ద‌క్కించుకుంటాడు. పెండ్లీ పీట‌ల వ‌ర‌కు వ‌చ్చినా స‌రే మారు వేశాల్లో పెండ్లి పీట‌లు ఎక్కి ప్రేయ‌సిని ద‌క్కించుకుంటాడు. మాయా బ‌జార్ నుంచి నిన్న‌.. మొన్న‌టి త‌రం నాయ‌కుల సినిమాల‌లో ఇలాంటి సీన్లు సూప‌ర్ హిట్టు. ఇదే ఫార్మూలాను పాటించి ఓ మాజీ ప్రేమికుడు పెండ్లి వేధిక‌పై ప్రియురాలును ద‌క్కించుకునేందుకు హాంగామా చేశాడు. విష‌యం తెలిసిన పెండ్లి పెద్ద‌లు చిత‌క బాద‌డంతో ఆ సినిమా సీన్ సితార అయ్యింది. సినిమా సీన్‌కు త‌గ్గ‌కుండా నిజ జీవితంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న పెండ్లిలో ఎవ‌రో రికార్డు చేసి ఇంట‌ర్నెట్‌లో పోస్టు చేశారు. ఈ విడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.
గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. వేదికపై బంధువులు వధూవరుల పెళ్లి వేడుకను చూస్తున్నారు. వివాహ పూర్తి కావ‌స్తున్న త‌రుణంలో వధువువరులు దండాలు మార్చుకోవడానికి సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో కండువా కప్పుకుని ఉన్న యువకుడు పెళ్లి వేదిక వద్దకు ఉత్స‌హాంగా చేరుకున్నాడు. వధువు నుదుటి మీద బొట్టుని పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు. అంత‌లో వేధిక మ‌ద్య‌లోకి వ‌చ్చిన ప్రియుడు వధువు నుదిటి మీద బలవంతంగా సిందూర్ దిద్దేందుకు ప్ర‌య‌త్నించాడు. వధువు తన ముఖాన్ని పరదాతో కప్పుకోవడానికి ప్రయత్నించింది. అలా పెళ్లి మండపానికి చేరుకున్న ఆ యువకుడు వధువుకు మాజీ ప్రేమికుడని తెలిసింది. కొన్ని నెలల క్రితం ఆ యువ‌కుడు పని నిమిత్తం ఊరు బయటకు వెళ్ల‌గా.. ఈలోగా అమ్మాయి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లిని నిశ్చయించారు. పెళ్లి విషయం తెలుసుకున్న మాజీ ప్రేమికుడు తన ప్రేమను సినిమా స్టైల్ లో అందరికీ చెప్పాలని నిర్ణయించుకుని ఇలా పెళ్లి పందిరిలో హంగామా సృష్టించాడు. పెళ్ళికి వచ్చిన బంధువులు యువకుడిని చితకబాది.. పోలీసులకు ఫోన్ చేశారు. ఇదంతా అక్కడ పెళ్ళికి హాజరైన ఎవరో వీడియో తీశారు. మ‌రోవైపు ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం, అమ్మాయికి పెద్దలు కుదిర్చిన వరుడితోనే వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం మాజీ ప్రేమికుడిని ఇంటికి పంపించారు.

https://www.youtube.com/watch?v=xXXFZ7NheXc&t=51s