కొత్త రేషన్‌ కార్డుకు ఆప్లై చేసుకోలేదా..?

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కొత్త రేషన్‌ కార్డుకు ఆప్లై చేసుకోలేదా..?
– అలా మిగిలిన లబ్దిదారులకు చాన్స్
– మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
– ఎప్పుడు, ఎక్కడా చేసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు సాగతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అయినా కొందరు దరఖాస్తులు చేసుకోలేదు. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకోలేదు. అలా మిగిలిపోయిన లబ్దిదారులకు సీఎం రేవంత్ సర్కారు మరో చాన్స్ ఇస్తోంది. ఈ సందర్భంగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం స్పష్టత ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తామని జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పాత రేషన్‌ కార్డుల్లో… కొత్తవారిని కూడా చేరుస్తామని కూడా వివరణ ఇచ్చారు. ఇటవల చేసిన క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాల్లో పేర్లు లేకపోతే టెన్షన్ పడొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవచ్చని సూచించారు.

అంతేకాకుండా రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. మంత్రి ప్రకటనతో.. ప్రస్తుతం జాబితాల్లో పేర్లు లేనివారికి ఊరట లభించింది. కాగా రేషన్ కార్డు అర్హత ఉండి కూడా రాకుంటే.. సంబంధిత అధికారికి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చు. ఈనెల 26 నుంచే రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఇదికూడా చదవండి…

సంతోషం పంచే సేవ..!