సంతోషం పంచే సేవ..!
– మనను దోచుకున్న రొంపల్లి సంతోష్ కుమార్
– జన్మదినం సందర్భంగా వస్తవుల వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, తెలంగాణ రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ కార్యదర్శి, సేవారత్న అవార్డు గ్రహీత రొంపల్లి సంతోష్ కుమార్ తన జన్మదినం సందర్భంగా పేదలకు, విద్యార్థులకు సంతోషం పంచే కానుకలు అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలో రొంపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పుట్టిన రోజు సందర్బంగా రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన ఎర్రనోళ్ల నర్సమ్మ అనే మహిళకు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్‌ను అందజేశారు. అదేవిధంగా పెద్దేముల్ మండలంలోని శ్రీవాణి విద్యామందిర్ పాఠశాలకు విద్యార్థుల కోసం బెంచీలను పంపిణీ చేశారు.
ఇందుకు మహిళతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ రొంపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని కన్యాపాఠశాల హనుమాన్ దేవాలయ భజన కమిటి సభ్యులు కూడా హాజరై రొంపల్లి సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా మహిళకు కుట్టు మిషన్, విద్యార్థుల కోసం బేంచీలు అందజేయడం సంతోషం కలిగించిందన్నారు. పేదల కోసం తనవంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, సోము, అసద్ అలీ, గౌరీ శంకర్, మహేష్, గురు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

