పేదల సంక్షేమానికే ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం
– ఆర్థిక భారం ఉన్న ఆపని సర్కారు
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తాండూరు పట్టణానికి చెందిన 110 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 1కోటీ 10లక్షల 12 వేల 760ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికి సంక్షేమాన్ని అమలు చేయడంలో వెనుకడుగు వేయడం లేదని అన్నారు. అర్హులైన పేదలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, అబ్దుల్ రజాక్, వెంకన్న గౌడ్, బోయ రవి, బోంబీనా, నాయకులు బాతుల వెంకటయ్య, అధికారులు, వివిధ వార్డుల నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాలేజీకి లాక్…!